సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది.. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం


భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు  అర్పించిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ కె పి ఎస్ కిషోర్,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ... 

ANDRAPRADESH, ఏలూరు: ఏలూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం - 2025 సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె పి ఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, నగర పాలక సంస్థ కో ఆప్షన్ మెంబర్ ఎస్.యం. ఆర్.పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మా తెలుగుతల్లికి మల్లెపూదండ ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ కె పి ఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సత్కరించారు. 

అదేవిధంగా స్కూల్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కింద జిల్లాలోని బెస్ట్ ఐదు స్కూల్స్ కింద పెదవేగి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, ఏలూరు సెయింట్ థెరీసా బాలికోన్నత పాఠశాల, ఏలూరు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్, పెదపాడు మండలం పుట్లూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం, దెందులూరు మండలం కొవ్వలి జిల్లా పరిషత్ హై స్కూల్ లకు అవార్డులను అందించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదనీ, సమాజంలో భగవంతుడు తర్వాత పూజింపబడేవారు ఒక ఉపాధ్యాయులేనని ఆయన పేర్కొన్నారు. తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీ అంటేనే ఒక పండుగని, ఆరోజు మనలో  విజ్ఞాన జ్యోతులు  వెలిగించిన ఉపాధ్యాయులు గుర్తు కొస్తారని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆదర్శాల నుంచి ఎందరో స్పూర్తి పొందుతున్నారన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ ,నీతి నిజాయితీ, మానవత్వం సృజనాత్మకత, ఆలోచన శక్తి ,నైతిక విలువలు అందిస్తు బాల బాలికలను బావి భారత పౌరులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారన్నారు. మరెందరో ఉపాధ్యాయులు ఏ వన్ వినియోగం, వివిధ వినూత్న పద్ధతుల్లో బోధన చేస్తూ విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దు తున్నారన్నారు.

తొలుత గండికోట రాజేష్ శిష్య బృందం కూచిపూడి నృత్యాలు చేసారు. ఈ కార్యక్రమంలో డిఈఓ యం.వెంకటలక్షమ్మ,జడ్పీ సీఈఓ శ్రీహరి,విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య,పలువురు యం.ఈ.వో లు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.