ఏలూరు జిల్లాలో ఆసియన్‌ గ్రీన్‌ బీ ఈటర్



ఏలూరు: జిల్లా కొల్లూరు ప్రాంతంలో అందాల అతిథి సందడి చేస్తోంది. ఆకుపచ్చ రంగులో, సూది మొనలాంటి ముక్కుతో.. గొంతుపై నీలం రంగు గీతతో ఓ పక్షి అందర్ని ఆకట్టుకుంటోంది. ఆసియన్‌ గ్రీన్‌ బీ ఈటర్‌ ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఈ పక్ష దాదాపు 15 సెం.మీ. పొడవుతో తలపై బంగారు రంగు టోపీ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇవి ఎక్కువగా సరస్సులు, నదులు, చిత్తడి నేలల్లో ఎక్కువగా ఉంటాయి. భారత్‌తో పాటుగా శ్రీలంక, ఇరాన్, ఆఫ్రికా, వియత్నాం దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవీ తేనెటీగలు, కందిరీగలు, కీటకాలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ప్రస్తుతం కొల్లేరులో ఈ పక్షులు 800 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.